SKLM: ఎల్.ఎన్.పేట మండలం పెద్దకోట–2 గ్రామంలో రూ.55 లక్షలతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్కు స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. గ్రామ స్థాయిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య మౌలిక వసతులను కల్పిస్తుందన్నారు.