PLD: ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందించేందుకు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల ‘మన మిత్రా’ వాట్సప్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. 9552300009 నంబర్ ద్వారా పనిచేసే ఈ విధానంలో 36 శాఖలకు చెందిన 700 పైగా సేవలు లభిస్తాయి. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఇంట్లోనే ఉండి ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇవాళ ఒక ప్రకటనసూచించారు.