KRNL: ఆదోని RTC డిపోకు చెందిన కండక్టర్ అజీమ్ ఖాన్ ఉత్తమ కండక్టర్ అవార్డు (ప్రథమ స్థానం)ను సాధించారు. ఇవాళ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు అజీమ్ ఖాన్కు అభినందన పత్రాన్ని అందజేశారు. ప్రయాణికుల పట్ల మర్యాద, విధి నిర్వహణలో నిబద్ధత, సేవాభావంతో పనిచేయడం వల్లే ఈ గౌరవం లభించిందని అధికారులు తెలిపారు. ఈ అవార్డు ఆదోని డిపోకు గర్వకారణమన్నారు.