BHNG: ఈనెల 31తో ముగియబోతున్న జర్నలిస్టుల అక్రిడేషన్ల చెల్లుబాటు తేదీని ప్రభుత్వం మరో రెండు నెలలు వరకు పొడిగించింది. ఈ మేరకు పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు. నూతన అక్రిడేషన్లు జారీకి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి పౌర సంబంధాల శాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.