VSP: వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని సింహాచలంలో ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ వాసునిగా స్వామి భక్తులను కటాక్షించారు. స్వామివారికి మహా నివేదన సందర్భంగా 3 గంటల పాటు దర్శనాలు నిలిపివేయబడ్డాయి. తిరిగి సాయంత్రం 3.30 గంటలకు దర్శనాలు పునః ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని దేవస్థానం అధికారులు కోరారు.