AP: కేంద్రమంత్రి పైమ్మసానిపై మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. అనుభవరాహిత్యంతో గుంటూరును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ‘శంకర్ విలాస్ బ్రిడ్జి ఎప్పటిలోగా పూర్తి చేస్తారు?. నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు. మేము ప్రశ్నిస్తే మహిళలతో తిట్టిస్తున్నారు. నగర అభివృద్ధికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి’ అని అంబటి డిమాండ్ చేశారు.