రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై జరిగిన డ్రోన్ల దాడిని ప్రధాని మోదీ ఖండించారు. ఈ దాడి పట్ల తాను ఆందోళనగా ఉన్నట్లు పేర్కొన్నారు. దౌత్య ప్రయత్నాలు మాత్రమే శాంతికి మార్గం అని మోదీ నొక్కిచెప్పారు. మరోవైపు ఉక్రెయిన్ చేపట్టిన డ్రోన్ల దాడులను తాము అడ్డుకున్నట్లు రష్యా తెలిపింది. అయితే, తాము దాడులకు పాల్పడలేదని ఉక్రెయిన్ ప్రకటించింది.