NZB: రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇందూరు సునీత అధ్యక్షతన ఇవాళ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 2BHK లబ్ధిదారుల ఎంపికలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సర్వేను పక్కన పెట్టాలని తెలిపారు. ప్రస్తుత పాలకవర్గం, గ్రామ పెద్దల సమక్షంలో అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించి ఆ సర్వేని గ్రామసభలో ప్రవేశపెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.