KDP: ఖాజీపేట మండలం కొత్త నెల్లూరు వద్ద ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. కనీస సదుపాయాలు లేకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాగేందుకు మంచినీరు, మరుగుదొడ్డి వంటి సదుపాయాలు కూడా అందుబాటులో లేకపోవడంతో అసౌకర్యానికి గురవుతున్నారు. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి ఖాతాదారులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.