RR: రాజేంద్రనగర్ బండ్లగూడలో విషాదం చోటుచేసుకుంది. కుమార్తెను చూసేందుకు వచ్చిన లక్ష్మి అనే వృద్ధురాలు లిఫ్ట్ ప్రమాదంలో మృతిచెందారు. నాలుగో అంతస్తులో లిఫ్ట్ వచ్చిందనుకుని గ్రిల్ ఓపెన్ చేసి అడుగు వేయగా, అప్పటికే లిఫ్ట్ అక్కడ లేకపోవడంతో నేరుగా కింద పడిపోయారు. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.