KMM: కొణిజర్ల మండలం గుబ్బగుర్తి అంజనాపురం గ్రామాల్లో మంగళవారం అటవీశాఖ ఆధ్వర్యంలో అడవి మండల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవికాలంలో అడవుల్లో మంటలు చెలరేగడం వల్ల వృక్ష సంపద, వన్యప్రాణులు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని FSO జి. ఉపేంద్రయ్య అన్నారు. అడవుల్లో మంటలు కనిపించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.