KRNL: సీఎం చంద్రబాబు జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇవాళ కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. అన్ని శాఖల పనితీరు మెరుగుపరుచుకోవాలని, ఫైళ్ల నిర్వహణ అంతా ఈ-ఆఫీస్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. ఫిజికల్ ఫైళ్లకు తావులేకుండా పారదర్శకత పాటించాలని సూచించారు. శాఖా పరమైన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.