SRD: నూతన సంవత్సర వేడుకల పేరిట నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. 31వ తేదీ రాత్రి బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మద్యం సేవిస్తూ కనిపిస్తే ఉపేక్షించబోమన్నారు. రోడ్లపై కేకులు కట్ చేస్తూ, డీజేలతో న్యూసెన్స్ సృష్టిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.