SS: జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మంగళవారం గాండ్లపెంట మండలం కటారుపల్లిలోని వేమన స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నంద వేమారెడ్డి కలెక్టర్ ను సన్మానించారు. ఆలయ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.