TG: రూ.కోటి దోపిడీ కేసులో పంజాగుట్ట పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఇండియన్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీ ఇస్తామంటూ మెహిదీపట్నానికి చెందిన వ్యాపారవేత్తను ఓ ముఠా మోసం చేసింది. రూ.కోటి విలువైన నగదు తీసుకుని క్రిప్టో ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు హైమద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.