SRPT: పంచాయతీ నిధులకు సంబంధించిన అన్ని చెక్కులపై సర్పంచి, ఉప సర్పంచి సంతకం చేసిన తర్వాతే నిధులు విడుదల చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రెజరీ శాఖ సంచాలకుడు, జిల్లా, సబ్ ట్రెజరీ అధికారులను ఉత్తర్వుల్లో ఆదేశించింది. రెండు సంతకాలు పరిశీలించిన తర్వాతే వాటిని ఆమోదించి, నిధులు విడుదల నిర్ణయం తీసుకోవాలని సూచించింది.