KRNL: దేవనకొండ మండలం మాచాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుతున్న సేవలు, హాజరు రిజిస్టర్లు, పోషకాహార సరఫరా, పిల్లల ఆరోగ్య పరిస్థితులు తదితర అంశాలను పరిశీలించారు. చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.