JGL: ముక్కోటి ఏకాదశి సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మంగళవారం జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థ, ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో హస్నాబాద్, అంబారిపేట్ గ్రామ యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.