KDP: కడపలోని ఆర్ట్స్ కాలేజీ, మున్సిపల్ గ్రౌండ్లో కమిషనర్ మనోజ్ రెడ్డి మంగళవారం ఉదయం పర్యటించారు. ప్రజా సదుపాయాలు, జిమ్, స్కేటింగ్ గ్రౌండ్లను పరిశీలించి, పెండింగ్ పనులు, జంగిల్ క్లియరెన్స్ వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కళాక్షేత్రం మరమ్మతులు, నాగరాజుపేట డ్రెయిన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం ఆఫీసర్స్ క్లబ్లో నూతన లాన్‌ను ప్రారంభించారు.