ప్రకాశం: ముక్కోటి ఏకాదశి పర్వతనాన్ని పురస్కరించుకొని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఇవాళ పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు.