శ్రీకాకుళం: వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని సేవించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేడు స్వామి దర్శనం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు.