WGL: నల్లబెల్లి మండల BJP పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో BJP పార్టీ రాష్ట్ర నాయకుడు తడుక అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. నర్సంపేట డివిజన్లోని వివిధ మండలాల్లో ఉన్న బెల్ట్ షాపుల్లో అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించలన్నారు.