ASF: జిల్లాలో ఈ ఏడాదిలో 73 గంజాయి కేసులు నమోదు చేసినట్లు ASF జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. 2025లో గంజాయి పంట సాగు చేసిన వారి గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. 73 గంజాయి కేసులు నమోదు కాగా, 122 మందిని అరెస్టు చేశామన్నారు. 15.224 కిలోల ఎండు గంజాయి, 1,118 మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.