ASF: 2025లో ఆసిఫాబాద్ జిల్లాలో నేరాల నియంత్రణ కోసం 126 కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్ తెలిపారు. కార్డెన్ సెర్చ్‌లో సరైన ధ్రువపత్రాలు లేని 2,821 వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేశామన్నారు. అలాగే నాకబందిలో 7,015 వాహనాలను తనిఖీ చేసి 14 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని 40 FIRలు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.