TG: HYDలోని నాచారంలో దారుణం చోటుచేసుకుంది. ఏపీకి చెందిన ముగ్గురు యువకులు నాచారంలో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో బంగారం కోసం యజమానురాలు సుజాతను హత్య చేశారు. అనంతరం డెడె బాడీని సూట్‌కేసులో తీసుకెళ్లి గోదావరిలో పడేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు అంజిబాబుతో పాటు సహకరించిన మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.