NLG: దేవరకొండ పట్టణంలో 4 ఎకరాలలో విస్తరించి ఉన్న గరుడాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని 11 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. ఈ దేవస్థానం రెండవ తిరుపతిగా అవతరించబోతుందని తెలిపారు. మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.