BHPL: జిల్లా కేంద్రంలో ఇవాళ కలెక్టర్ రాహుల్ శర్మ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని రైతులకు సహాయం చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వరి, మొక్కజొన్నతో 10 రకాల పంటలు 1,26,805 ఎకరాల్లో సాగవుతున్నాయి. రైతులు కంట్రోల్ రూం నెంబర్కు 7893098307 ఫోన్ చేసి సమస్యలు తెలియజేయవచ్చని సూచించారు.