NRML: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వారి సతీమణి అల్లోల విజయలక్ష్మి దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఆలయంలో జరిగిన వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.