ఆఫీసులో కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు లభించకపోగా.. బాస్ నుంచి ‘సిగ్గుపడండి’ వంటి కించపరిచే మాటలు ఎదురైనప్పుడు ప్రొఫెషనల్‌గా వ్యవహరించడం ముఖ్యం. ఆయన మిమ్మల్ని విమర్శించినంత మాత్రాన మీరు తక్కువ అని భావించకండి. మీ హక్కుల కోసం గళం ఎత్తడం అలవాటు చేసుకోండి. నిరంతరం కించపరిచే చోట పని చేయడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడు కొత్త ఉద్యోగం వెతకడం ఉత్తమం.