సుమారు 900 ఏళ్ల క్రితం స్కాట్లాండ్లో ముద్రించిన తొలి పురాతన నాణేన్ని ఇటీవలే పరిశోధకులు గుర్తించారు. ఈ నాణేన్ని స్కాట్లాండ్ నేషనల్ మ్యూజియం కొనుగోలు చేసింది. ఇది స్కాట్లాండ్లో ముద్రితమైన అత్యంత పురాతన నాణేలలో ఒకటిగా భావిస్తున్నారు. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.18 లక్షలకు సమానం. నాణేన్ని కనుగొన్న వ్యక్తికి అదే మొత్తాన్ని చెల్లించినట్లు అధికారులు తెలిపారు.