భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని SC గర్ల్స్ హాస్టల్లో ఓ విద్యార్థినిని వార్డెన్ భవాని సోమవారం ఉదయం కర్రతో తీవ్రంగా కొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇవాళ వార్డెన్ భవానిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులపై చేయి చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.