మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నేడు గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి శ్యామల అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉపాధి హామీ పథకం (EGS) కింద చేపట్టిన పనులపై ఆడిట్ అధికారి రాజశేఖర్ తనిఖీలు చేపట్టారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు, జాబ్ కార్డుల వినియోగంపై ఆయన సమగ్రంగా ఆడిట్ నిర్వహించి పలు సూచనలు చేశారు.