MBNR: గంగారం ప్రజలకు ఎస్సై రవికుమార్ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పలు సూచనలు చేశారు. డిసెంబర్ 31న మద్యం తాగి వాహనాలు నడపరాదు, రోడ్లపై ఇద్దరి కంటే ఎక్కువగా సంచరించరాదు, బాణసంచాలు కాల్చరాదు అన్నారు. నూతన సంవత్సర వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య సురక్షితంగా, ఆనందకరంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.