W.G: తాడేపల్లిగూడెంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. వైష్ణవాలయాలన్నీ భక్తులతో బారులు తీరాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని భక్తుల నమ్మకం. అందుకే దక్షిణ ద్వారం ద్వారా స్వామిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.