దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో 118 విమానాలు రద్దు అయ్యాయి. వీటిలో ఇందియా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన 60, బయల్దేరాల్సిన 58 రద్దు అయినట్లు అధికారులు చెప్పారు. మరో 16 ఫ్లైట్లను దారిమళ్లించగా, 130 విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.