విశాఖ: సింహాచలం అప్పన్న స్వామివారి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా సింహగిరికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో భక్తుల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ విలువైన బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు, ఇతర వస్తువులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ పిల్లలు, వృద్ధుల పట్ల ప్రతిక్షణం అప్రమత్తమై ఉండి స్వామి వారి దర్శనం చేసుకోవాలని అనౌన్సర్ సత్యనారాయణ తెలిపారు.