PDPL: గొర్రెలు, మేకలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని పశువుల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని కొత్తూరు గ్రామ సర్పంచ్ భూక్య సంగీత ఆంజనేయులు కోరారు. ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జీవాలకు నట్టల నివారణ మందును పంపిణీ చేశారు.