VZM: వైకుంఠ ఏకాదశి సందర్భంగా విజయనగరంలో అతి పురాతన దేవాలయమైన శ్రీమన్నార్ రాజగోపాల్ స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కొరకు భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు వేకువఝాము నుండి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీ ఛైర్మన్ దేవేంద్రనాథ్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మంచినీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు.