TPT: తిరుపతి రూరల్ తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం 3:30 నిమిషాలకు అర్చకులు ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.