MNCL: మంచిర్యాలలోని అండాలమ్మ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఏసీసీ ప్రకాష్, సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు, 40 మద్యం సీసాలు, 10 బీర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రత కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు.