వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ బైపాస్ తిరుమలనాథ స్వామి దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మహబూబ్నగర్ పట్టణం నుండి తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఏడుకొండలవాడిని ప్రత్యేకంగా ఆలంకరించారు.