US అధ్యక్షుడు ట్రంప్ వీసా నిబంధనల కఠినతరంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. కఠిన ఇమిగ్రేషన్ రూల్స్ నేపథ్యంలో చాలామంది విదేశీ ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లకే పరిమితమవుతున్నారు. అధికారుల దృష్టిలో పడకూడదనే ఉద్దేశంతో వలసదారులు జాగ్రత్త పడుతున్నారని KFF, న్యూయార్క్ టైమ్స్ సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ పరిణామాలు భారతీయ ప్రవాసుల్లో తీవ్ర అభద్రతాభావాన్ని పెంచుతున్నాయని తెలిపింది.