బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా (80) మృతి పట్ల భారత ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులకు, బంగ్లాదేశ్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా, భారత్-బంగ్లా సంబంధాల బలోపేతానికి ఆమె విశేష కృషి చేశారని ప్రధాని కొనియాడారు.