BHNG: రామన్నపేటలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు ఉత్తర ద్వారమున భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ గరిక సత్యనారాయణ రాధిక స్వామి వారి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.