VZM: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం జామి మండలం, అన్నమరాజుపేట గ్రామంలో వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి వారిని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనాలు పలికారు.