కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున వైకుంఠ ద్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేసి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.