GNTR: పొన్నూరు పట్టణంలోని శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.