MBNR: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆలయాన్ని కుటుంబసభ్యులతో కలిసి ఈ తెల్లవారుజామున దర్శించుకున్నారు. అర్చకుల ఆధ్వర్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులకు అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు.