అల్లూరి జిల్లాలో రూ.8.41కోట్లతో మీ ఇంటికి, మీ డాక్టర్ ప్రాజెక్టు మూడేళ్ల పాటు అమలు చేయడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రాష్ట్ర శాఖ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ధిక సాయంతో ఈ ప్రాజెక్టు ప్రారంభం అవుతుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల మొదటి వారంలో రాష్ట్ర గవర్నర్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారన్నారు.