కర్ణాటకలోని మైసూరు-మడికేరి బస్సులో ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది. ప్రయాణికుడు పిల్లితో బస్ ఎక్కడంతో దానికీ టికెట్ కొనాలని కండెక్టర్ చెప్పడంతో ఇద్దరికీ టికెట్లు తీసుకున్నాడు. ఇద్దరికి టికెట్లు కొట్టిన కండక్టర్.. ఒకటి పిల్లికి అని రాశాడు. టికెట్ తీసుకున్న పిల్లి సీట్లో కూర్చొని ఫొటోలకు ఫోజు ఇచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.